హార్ట్ ఎటాక్ రావడానికి ఓ విటమిన్ కారణమవుతుందని తాజా అధ్యయనం తెలిపింది.

అధిక మొత్తంలో విటమిన్ బి3 తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు వస్తున్నట్లు గుర్తించారు.

నియాసిన్ తీసుకోవడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయని స్టడీలో తేల్చారు.

ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్నాయని వెల్లడించారు.

ఈ విటమిన్​ను లిమిటెడ్​గా తీసుకుంటే మంచిదే కానీ.. ఎక్కువగా తీసుకోకూడదు అంటున్నారు.

పిండి, తృణధాన్యాలు, ఓట్స్ వంటి వాటిలో ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.

పురుషులు రోజులో 16 మిల్లీగ్రాములు విటిమిన్ బి3 తీసుకుంటే మంచిది.

మహిళలు , గర్భం దాల్చనివారు 14 మిల్లీ గ్రాములు తీసుకోవచ్చు.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Pixabay)