టీని తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఉదయం, సాయంత్రం తాగుతూ ఉంటారు.

కానీ కొందరు భోజనం చేశాక కూడా టీ తాగుతారు. ఇలా తాగడం మంచిదా కాదా?

తిన్న తర్వాత నిద్ర వస్తుందని.. లేదా టీ తాగితే మంచి కిక్​ ఉంటుందనుకుంటారు.

కానీ ఇలా ఫుడ్​ తిని టీ తాగితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు.

భోజనం తర్వాత టీ రెగ్యులర్​గా తాగితే ఐరన్ లోపం, ఎనిమియా వంటి ఇబ్బందులు వస్తాయట.

మరికొందరిలో టీ కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట.

తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరానికి అందకుండా చేస్తుందట టీ.

పాలు, షుగర్​ శరీరంలో ఎసిడిటీని పెంచి.. ఫుడ్ ప్రాసెస్ చేయడాన్ని లేట్ చేస్తాయట.

అలాగే మీరు మధ్యాహ్న భోజనం తర్వాత టీ తీసుకున్నా అది స్లీపింగ్ సైకిల్​ను డిస్టర్బ్ చేస్తుందట.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.