పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే పిల్లల నుంచి పెద్దలవరకు పాలు తాగుతూ ఉంటారు.

పాలు తాగడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. బోన్ హెల్త్​కి మంచిది.

దంత సంరక్షణతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.

అయితే రోజూ పాలు తాగడం వల్ల కొందరికి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

పాలు తాగడం వల్ల కొందరిలో గ్యాస్, అపానవాయువు, విరోచనాలు వంటి సమస్యలు వస్తాయి.

మరికొందరి ఇది మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

పాలల్లోని లాక్టోస్ కొందరికి ఇబ్బందిని కలిగిస్తుంది. అలాంటివారు పాలు తాగితే జీర్ణం కావు.

దీనివల్ల వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త.

కొందరిలో పాలు స్కిన్ అలెర్జీకి దారి తీస్తాయి. దద్దర్లు వంటి ర్యాష్ వస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయ్యి పాలు తాగితే మంచి ఫలితాలుంటాయి.