విటమిన్లను ఆవశ్యక సూక్ష్మపోషకాలు అంటారు. అంటే తక్కువ మొత్తంలో అవసరమయ్యే పోషకాలన్నమాట.

ఈ మధ్య సప్లిమెంట్ల వాడకం పెరిగిన నేపథ్యంలో విటమిన్ C ఎక్కువ తీసుకుంటే కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం.

విటమిన్ C ఎక్కువ తీసుకుంటే వికారం, కడుపునొప్పి, విరేచనాల వంటి జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.

ఎక్కువ కాలం పాటు ఇలా ఎక్కువ మొత్తంలో విటమిన్ C వాడితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

విటమిన్ C ఎక్కువ తీసుకుంటే శరీరం ఐరన్ శోషించుకునే సామర్థ్యం తగ్గుతుంది.

విటమిన్ C ఎక్కువైనపుడు జీవక్రియల మీద ప్రభావం చూపుతుంది. విటమిన్ B12 శోషణ లో అడ్డుపడుతుంది.

విటమిన్ C నమిలి తినే టాబ్లెట్ల రూపంలో ఎక్కువ మొత్తంలో తీసుకుంటే సెన్సిటివిటి, దంతక్షయం వంటి దంత సమస్యలు వస్తాయి.

విటమిన్ C ఎక్కువ తీసుకుంటే తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు రావచ్చు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!