Image Source: pexels

ఎలర్జీ, చుండ్రు వల్ల తలలో దురద వస్తుంది. దురదకు చెక్ పెట్టే హెయిర్ ప్యాక్ లు ఏవో చూద్దాం.

వేపలో యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియన్ గుణాలు ఉన్నాయి.

జుట్టులో చుండ్రు, ఫ్రిజ్ ఫ్రి హెయిర్, జుట్టుకు పోషణకు ఉపయోగపడుతుంది.

కొబ్బరినూనెలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చండ్రును తగ్గిస్తాయి.

వేప ఆకులు, పెరుగు, కొబ్బరినూనె, తేనే కలిపి హెయిర్ ప్యాక్ చేసుకుని ఒక గంట తర్వాత షాపుతో జుట్టును కడగాలి.

మెంతి ఆకులను పేస్టులా చేసి అందులో వేపపొడి, పెరుగు, కొబ్బరినూనె వేసి హెయిర్ ప్యాక్ చేసుకోవాలి.

అలోవెరా జెల్, వేపపొడి, కొబ్బరినూనె కలిపి జుట్టుకు అప్లయ్ చేసి అరగంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి.

గోరింటాకు పొడి, వేపపొడి, కొబ్బరినూనె, కొన్ని నీళ్లు కలిపి పేస్టు చేసి జుట్టుకు అప్లయ్ చేయాలి.

కరివేపాకు, వేపపొడి, కొబ్బరినూనె మిక్స్ చేసి జుట్టుకు అప్లయ్ చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.