హీరోయిన్స్ కూడా కొన్ని అందం కోసం కొన్ని సహజమైన ఉత్పత్తులనే ఎంచుకుంటారు. అలాంటివారిలో శ్రద్ధా కపూర్ ఒకరు.

శ్రద్ధా కపూర్ కూడా తన జుట్టు విషయంలో అదే ఫాలో అవుతుంది. హెయిర్, బ్యూటీ విషయంలో ఆమె ఇస్తున్న టిప్స్ ఇవే.

శ్రద్ధా కపూర్​ తనకు సెన్సిటివ్ స్కిన్​ ఉంది కాబట్టి రోజుకు రెండుసార్లు మాత్రమే ఫేష్ వాష్ చేస్తుందట.

ముఖానికి చేతులను వీలైనంత దూరంగా ఉంచుతానని, ఫేస్ మాస్క్​లు, స్క్రబ్​లు కూడా అవసరం లేదని చెప్తుంది.

కన్సీలర్​ అంటే తనకు చాలా ఇష్టమని.. దానిని మంచి లుక్​కోసం ఎక్కువగా వినియోగిస్తానని తెలిపింది.

మీ లుక్​కి సరిపోయే బోల్డ్ లిప్​స్టిక్ షేడ్ ఎప్పుడూ మీతో ఉండాలని చెప్తుంది. ఇది మొత్తం లుక్​ని హైలెట్ చేస్తుందని చెప్తోంది.

డ్యాన్స్ రెగ్యులర్​గా చేస్తుంది. ఇది ఫిట్​గా ఉండడంతో పాటు.. ముఖంలో మంచి గ్లోని ఇస్తుందని తెలిపింది.

కలబంద, మందార ఆకులు, పువ్వులు పెరుగు కలిపిన పేస్ట్​ని హెయిర్​కి ఉపయోగిస్తుందట.

ఇది జుట్టుకు మంచి పోషణ అందించి పెరుగుదలను, హైడ్రేషన్​ను అందిస్తుందని తెలిపింది.

హెయిర్ డ్యామేజ్ తగ్గించడానికి స్టైలింగ్స్ ఎక్కువ చేయదట. తప్పని పరిస్థితుల్లో సీరమ్ అప్లై చేసి స్టైల్ చేస్తానని తెలిపింది.