యాపిల్‌ను తొక్కతో తినాలా? తొక్క తీసి తినాలా?

యాపిల్ పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే.

కానీ, ఈ రోజుల్లో చాలామంది తొక్క తీసి యాపిల్‌ను తింటున్నారు.

దాని మీద వ్యాక్స్ ఉంటుందనే కారణంతో తొక్కను తొలగిస్తున్నారు.

మరి, యాపిల్‌ను తొక్క తీసి తినాలా? తొక్క తీయకుండా తినాలా?

వాస్తవానికి ఈ పండులోని అత్యధిక పోషకాలు తొక్కలోనే ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

కానీ, యాపిల్ ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు రసాయనాలతో కూడిన వ్యాక్స్ వాడుతున్నారు.

కాబట్టి, తొక్క తీసి తినడమే ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు.

తొక్కపై మచ్చలు ఉన్నట్లయితే, అందులో క్రిములు ఉన్నాయని అర్థం. కాబట్టి తొక్క తీసి తినాలి.

ఒకవేళ మీరు వ్యాక్స్ తొలగించాలని అనుకుంటే గోరువెచ్చని నీటిలో యాపిల్ పెట్టంది.

అప్పుడు వ్యాక్స్ దానికతే తేలిపోతుంది. ఆ తర్వాత బాగా శుభ్రం చేసి తినండి.

Image Credit: Pixabay