ఏడు వారాల నగలు గురించి చాలామంది వినే ఉంటారు. దానిలో మీరు కూడా ఒకరు అయి ఉండొచ్చు.

ఏడు వారాల నగలను ఎలా డివైడ్ చేశారో తెలుసా? ఒక్కో రోజుకి.. ఒక్కో తరహా నగలు వేసుకోవడమే ఏడు వారాల నగలు.

వారంలోని ఏడు రోజుల్లో.. ఆరోజు వారానికి తగ్గట్లుగా నగలను వేసుకునేవారట. అవేంటో చూసేద్దాం.

ఆదివారం రోజు సూర్యుని కోసం కెంపులను వేసుకునేవారు. వాటికి తగిన కమ్మలు, హారాలు మొదలైనవి వేసుకునేవారు.

సోమవారం చంద్రుని కోసం ముత్యాల జ్యూవెలరీ వేసుకునేవారు. ముత్యాల హారాలు, ముత్యాల గాజులు మొదలైనవి.

మంగళవారం కుజుని కోసం పగడాల నగలు వేసుకునేవారు. పగడాల దండలు, ఉంగరాలు మొదలైనవి.

బుధవారం పచ్చల నగలు. పచ్చల హారం, పతకాలు, గాజులు వంటివి వేసుకునేవారు.

గురువారం బృహస్పతి కోసం పుష్యరాగం కమ్మలు, ఉంగారు ధరించేవారు.

శుక్రవారం శుక్రుని కోసం వజ్రాల నగలు వేసుకునేవారు. వజ్రాల హారం, వజ్రాల ముక్కుపుడక వంటివి.

శనివారం శని ప్రభావం తగలకుండా ఉండేందుకు నీలమణి హారాలు వేసుకునే వారు.