ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లో పాలీఫెనాల్స్ పుష్కలం. ఓలియోకాంథాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఓలియోక్ ఆసిడ్, పాలీఫెనాల్స్ వల్ల ఆలీవ్ ఆయిల్ తో బీపీ అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల రకరకాల క్యాన్సర్లను కూడాను ఆలీవ్ ఆయిల్ నివారిస్తుంది. ఆలీవ్ ఆయిల్ లోని పాలీఫెనాల్స్ అల్జీమర్స్, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు మంచి పరిష్కారం. ఆలీవ్ ఆయిల్ తో ఇన్ఫ్లమేషన్ తగ్గి కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడుతాయి. ఆలీవ్ ఆయిల్ ఎముకల ఆరోగ్యానికి కూడా మేలుచేస్తుంది. ఎముక సాంద్రతను నిలిపి ఉంచుతుంది. ఆలీవ్ ఆయిల్ లోని యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వల్ల నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఆలీవ్ ఆయిల్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గించి టైప్ 2 డయాబెటిస్ ను నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ తో బరువు నియంత్రణలో ఉంటుంది. జీవక్రియలు వేగంగా జరుగుతాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే