వేయించిన శనగలను స్నాక్స్​గా తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వెజిటేరియన్స్​, వీగన్స్​కి ప్రోటీన్​కి ఇది మంచి సోర్స్.

వీటిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేసి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

వీటిలో వివిధ రకాల విటమిన్లు.. ఫోలేట్, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి.

వీటిలోని ఫైబర్, ప్రోటీన్, పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బీపీని కంట్రోల్ చేస్తాయి.

కేలరీలు తక్కువగా ఉండి.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

బ్లడ్ షుగర్​ని రెగ్యులేట్ చేసుకోవాలనుకునేవారు కూడా దీనిని డైట్​లో చేర్చుకోవచ్చు.

వీటిని నేరుగా తీసుకోవచ్చు. సలాడ్స్​లో కూడా టాపింగ్​గా వేసుకోవచ్చు.

పోషకాలు అందించే ఈ శనగలను పెద్దల నుంచి పిల్లలవరకు అందరూ తీసుకోవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.