బరువు తగ్గాలని అనుకునే వారికి అందరూ ముందుగా ఇచ్చే సలహా అన్నం మానేసి రోటి తినమని.

కానీ ఒకొక్కరి పోషణ అవసరాలు ఒక్కోలా ఉంటాయి. అందరి శరీరాలు ఒకే రకంగా స్పందించవు. అందువల్ల బరువు తగ్గడం కష్టం కావచ్చు.

తెల్లని అన్నంతో పోల్చితే రోటిలో క్యాలరీలు తక్కువ కనుక చాలా మంది రోటి వైపే మొగ్గు చూపుతారు.

అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. శరీరానికి త్వరగా శక్తి లభిస్తుంది. వర్కవుట్ చేసేందుకు మరింత బలాన్ని ఇస్తుంది.

హోల్ గ్రెయిన్ రోటిలో ఫైబర్ ఎక్కువ. కనుక కడుపునిండుగా ఉండి క్యాలరీ ఇన్ టేక్ తగ్గుతుంది.

రోటిలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి కనుక నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అందువల్ల రక్తంలో చక్కెర త్వరగా చేరదు.

తెల్లని బియ్యం కంటే బ్రౌన్ రైస్ లేదా చిరుధాన్యాలు వాడడం మంచిది.

రోటి తయారీలో నూనె లేదా నెయ్యి వంటివి వాడుతారు. కానీ అన్నం వండేందుకు అవసరం లేదు కనుక ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.

పీసీఓఎస్, గ్లుటేన్ సెన్సిటివిటి, సిలియాక్ డిసీజ్ వంటి సమస్యలున్న వారికి రోటిలోని ఫైబర్ వల్ల నష్టం జరగవచ్చు. వీరికి అన్నమే మంచిది.

రోటీ అయినా, అన్నం అయినా సరే ఎక్కువ మొత్తంలో కూరగాయలతో కలిపి తీసుకుంటే పోషకాలు అందడంతో పాటు బరువు తగ్గవచ్చు.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే