ఆయిల్‌ను పదే పదే రి-యూజ్ చేస్తున్నారా? మెదడు మటాషే!

పూరీలు, బజ్జీలు, బూరెలు, గారెలకు వాడిన ఆయిల్‌ను చాలామంది దాచిపెడతారు.

ఒకసారి వాడేసిన ఆయిల్‌ను దాచిపెట్టి మరీ.. కూరలు లేదా పోపులు, వేపుళ్ల కోసం ఉపయోగిస్తుంటారు.

అయితే, అలా చెయ్యడం చాలా ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు.

డీప్ ఫ్రై ఆయిల్స్ వాడితే న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు వస్తాయి.

ఎలుకలపై జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది.

రి-యూజ్డ్ ఆయిల్‌తో చేసిన ఆహారం తిన్న ఎలుకలు న్యూరోడెజెనరేటివ్‌కు గురైనట్లు పరిశోధకులు గుర్తించారు.

తాజా ఆయిల్‌తో చేసిన ఆహారాలు తిన్న ఎలుకలు మాత్రం ఆరోగ్యంగానే ఉన్నాయట.

రి-యూజ్డ్ ఆయిల్స్ పొట్ట, మెదడు, కాలేయం మధ్య సమతుల్యత దెబ్బతీస్తాయట.

అది న్యూరోడెజెనరేటివ్ సమస్యలకు దారి తీస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని పరిశోధకులు చెప్పారు.

కాబట్టి, వంట నూనెను ఒకసారి వాడిన తర్వాత పదే పదే ఉపయోగించవద్దు.

Images Credit: Pexels