Image Source: pexels

వర్షాకాలంలో జలుబుకు ఈ వంటింటి చిట్కాలతో చెక్

వర్షాకాలంలో జలుబు, గొంతు నొప్పి, ముక్కుదిబ్బడ వంటివ ఇబ్బంది పెడుతుంటాయి.

వర్షాకాలంలో వేధించే అంటువ్యాధులు, జలుబుకు ఇంటినివారణలతో చెక్ పెట్టవచ్చు. అవేంటో చూద్దాం.

అల్లం టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇవి గొంతు నొప్పిని, గొంతు గరగరను తగ్గిస్తుంది

గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ రసం కలుపుకుని తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

పసుపుపాలలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.

ఒక కప్పు నీటిలో 2 -3 వెల్లుల్లి రెబ్బలు వేసి ఉడకబెట్టి తాగితే అంటువ్యాధులకు చెక్ పెట్టవచ్చు

పడుకునే ముందు పసుపుపాలు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

మెంథాల్లో పిప్పరమెంట్ ఉంటుంది. ఇది నాసికా భాగాలను క్లియర్ చేసి గొంతు నొప్పిని తగ్గిస్తుంది.

సాల్ట్ వాటర్ తో రోజుకు రెండు లేదా మూడు సార్లు గార్గ్ చేస్తే గొంతు మంట తగ్గుతుంది.

Image Source: pexels

వేడినీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ వేసి ఆవిరి పీల్చుకుంటే నాసికా రద్దీని క్లియర్ చేయవచ్చు.