చియా సీడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా సమ్మర్​లో వీటిని ఇలా తీసుకుంటే చాలా మంచిది.

ఈ వేసవిలో ఈ చియాసీడ్స్​ని ఎలా తీసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నారా? అయితే ఇవి మీకోసమే.

బాదంపాలు, తేనే, చియా సీడ్స్ వేసి కలిపి.. రాత్రంతా ఫ్రిడ్జ్​లో ఉంచి.. చియా పుడ్డింగ్​గా ఫ్రూట్స్ వేసుకుని తినొచ్చు.

మీకు నచ్చిన పండ్లు, పెరుగు లేదా పాలల్లో వేసి చియాసీడ్స్​ని బ్లెండ్ చేసి.. హెల్తీ స్మూతీగా తాగొచ్చు.

నీటిలో చియాసీడ్స్ వేసి ఇన్​ఫ్యూజ్ చేస్తూ.. కొన్ని గంటలు ఫ్రిడ్జ్​లో ఉంచి తాగినా మంచిదే.

వెజిటేబుల్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్​లో చియా సీడ్స్ వేసి హెల్తీ ఫుడ్​గా తీసుకోవచ్చు.

నిమ్మరసంలో తేనే కలిపి నీళ్లు వేసి.. దానిలో చియా సీడ్స్ వేసుకుని రిఫ్రెషింగ్ డ్రింక్​గా తాగొచ్చు.

ఐస్​ క్యూబ్స్​గా చేసుకుని.. వాటిని మీకు నచ్చిన సమ్మర్​ డ్రింక్​లో వేసుకుని తాగవచ్చు.

సమ్మర్​లో వీటిని తీసుకోవడం వల్ల హైడ్రేషన్, కూలింగ్ ఎఫెక్ట్, పోషకాలు అందడంతో పాటు జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

చియా సీడ్స్ తీసుకున్నప్పుడు కచ్చితంగా నీటిని ఎక్కువగా తీసుకోవాలని గుర్తించుకోవాలి.