సమ్మర్లో స్కిన్ టాన్‌కు గురై.. మొహం నిర్జీవంగా కనిపిస్తుంది. అయితే రెండు నిమిషాల్లో మీకు మెరిసే, రిఫ్రెష్ స్కిన్ కావాలనుకుంటున్నారా? కొన్ని సింపుల్ టిప్స్‌తో మీరు ఇన్‌స్టాంట్‌గా కోల్పోయిన గ్లోని తిరిగి పొందగలుగుతారు. రోజ్ వాటర్‌ను ముఖంపై స్ప్రే చేసి.. టిష్యూతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఐస్ క్యూబ్‌తో ముఖంపై మసాజ్ చేస్తే మురికిపోయి.. రిఫ్రెష్‌గా ఉంటుంది. పాలలో కాటన్ ముంచి.. ముఖాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఫేస్‌కి మంచి గ్లోని ఇస్తుంది. సరైన నిద్ర ఉంటే స్కిన్ హెల్తీగా ఉంటుంది. నిద్రలో చర్మం రిఫ్రెష్ అవుతుంది. వాడేసిన టీ బ్యాగ్‌ను ఫ్రిజ్‌లో ఉంచి.. వాటిని ముఖాన్ని స్క్రబ్ చేసుకునేందుకు వినియోగించుకోవచ్చు. ఇవి అవగాహన కోసం మాత్రమే. వైద్యులను సంప్రదించి తీసుకుంటే మంచిది. (Images Source : Unsplash)