వేసవిలో వివిధ కారణాల వల్ల కొందరికి దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. అలాంటి వారు ఈ టిప్స్​ ఫాలో అవ్వొచ్చు.

హైడ్రేటెడ్​గా ఉండాలి. నీటిని తాగాలి. హెర్బల్ టీ, సూప్స్, గొంతును క్లియర్ చేసి.. నొప్పిని జలుబును దూరం చేస్తాయి.

శరీరానికి తగినంత రెస్ట్ ఇవ్వాలి. జలుబు, దగ్గు ఇన్​ఫెక్షన్​తో పోరాడాలంటే తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం.

హ్యూమిడిఫియర్ ఉపయోగించాలి. ఇది గాలిని మాయిశ్చరైజ్ చేసి దగ్గు నుంచి ఉపశమనం ఇస్తుంది.

గోరువెచ్చని నీటిలో సాల్ట్ వేసి.. నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. ఇన్​ఫెక్షన్లు దూరమవుతాయి.

దగ్గు, జలుబును ట్రిగర్ చేసే వాటికి వీలైనంత దూరంగా ఉండండి. మాస్క్ వాడితే మంచిది.

మీరుండే ప్రదేశాలు శుభ్రంగా, డస్ట్ లేకుండా ఉండేలా చూసుకోండి. డస్ట్ అలెర్జీ వల్ల కూడా దగ్గు, జలుబు వస్తాయి.

ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఇన్​ఫెక్షన్ వేరే వాళ్లకి రాకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి.

మెడిటేషన్, యోగా, డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించి.. ఇన్​ఫెక్షన్లతో పోరాడే బలాన్ని చేకూర్చుతాయి.

సహజంగా తగ్గించుకోవాలనుకుంటే ఓ స్పూన్ తేనెను తీసుకుంటూ ఉండండి. గొంతు నొప్పి తగ్గుతుందట.

అల్లాన్ని వేటినీటిలో మరిగించి తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. జలుబు, దగ్గు కంట్రోల్ అవుతుంది.