చక్కెర వినియోగం పిల్లల ఆరోగ్యానికి కూడా చెరుపు చేస్తుంది.

అప్పుడే దంతాలు వస్తున్న పిల్లల్లో చక్కెర కలిగిన పదార్థాలు తినడం వల్ల దంతక్షయం అవుతుంది.

చక్కెర ఎక్కువగా తీసుకునే పిల్లల్లో అనారోగ్యకరంగా శరర బరువు పెరుగి ఊబకాయానికి కారణం అవుతుంది.

ఎక్కువ చక్కెర కలిగిన ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల ఇతర పోషకాలు సరిపడినంత అందకపోవడంతో పోషకాహార లోపం ఏర్పడవచ్చు.

చక్కెర వల్ల శక్తి వినియోగంలో తేడాలు ఏర్పడి వారిలో మూడ్ సరిలేకపోవడానికి, తరచుగా చికాకు పడడానికి కారణం అవుతుంది.

దీర్ఘకాలం పాటు చక్కెరలు వినియోగించిన పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఇతర ప్రమాదం పొంచి ఉంటుంది.

ఎక్కువ చక్కెర వినియోగించే పిల్లల్లో ప్రవర్తన పరమైన సమస్యలుు కూడా తలెత్తవచ్చు.

హైపర్ యాక్టివ్ గా ఉండడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు రావచ్చు.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే