Image Source: pexels

ప్రతిరోజూ చేపలు తింటే లాభాలే కాదు నష్టాలూ ఉన్నాయ్

చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ ప్రతిరోజూ చేపలు తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.

వారానికి 8 నుంచి 12 ఔన్సుల చేపలు తినాలని వైద్యులు చెబుతున్నారు.

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు చేపలు తక్కువగా తినాలని సూచిస్తున్నారు.

చేపలు అలర్జీలకు కారణమవుతాయి.చేపలు తిన్న వెంటే అలర్జీ వచ్చినట్లయితే వైద్యులను సంప్రదించాలి.

సాల్మాన్ వంటి అధిక కొవ్వు రకాల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

కింగ్ మాకెరెల్, స్వోర్డ్ ఫిష్, టైల్ ఫిష్ వంటి పెద్ద చేపలు నాడీ వ్యవస్థలో సమస్యలకు కారణం అవుతాయి.

చేపల్లోని లీన్ ప్రొటీన్ కణజాలాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతుంది.

చేపల్లో లభించే విటమిన్ బి, జీవక్రియ, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

ఒమేగా 3తోపాటు చేపలు ఎముకల ఆరోగ్యానికి సహాయపడతే విటమిన్ డి, కళ్లకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

చేపల్లో లభించే ఒమేగా 3, అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అల్జీమర్స్ వ్యాధులనుంచి రక్షిస్తాయి.

Image Source: pexels

సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి.