స్పైసీ గా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్టేనట స్పైసీగా ఉండే ఆహారాలు వేడిగా తింటే ఆరోగ్యానికి మేలు చేస్తాయట. హార్వర్డ్, చైనా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధ్యయనం ప్రకారం కారంగా ఉండే ఆహారం ఆయుష్షు పెంచుతుందట. వారంలో 6-7 రోజుల పాటు కారంగా ఉండే ఆహారం తీసుకునే వారిలో మరణాలరేటు 14 శాతం తక్కువగా ఉందట. స్పైసీ గా ఉండే ఆహారం తీసుకుంటే జీవక్రియల వేగం పెరుగుతుంది. మిరియాలు, మిరపకాయలు, దాల్చీని, పసుపు, జీలకర్ర వంటి మసాలాలతో జీవక్రియలు వేగం పుంజుకుంటాయి. పసుపులో ఉండే కర్క్యూమిన్ ఇన్ఫ్లమేషన్ నివారిస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది కూడా. మిరపకాయల్లో ఉండే క్యప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలతో కూడా పోరాడుతుందట. మసాలాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.