ఖర్జూరాల్లో ఫైబర్, ఐరన్, పొటాషియం, సోడియం వంటి పోషకాలు ఉంటాయి.

ఈ పోషకాలు శరీరం త్వరగా శక్తి సంతరించేందుకు అవసరం.

ఖర్జూరాల్లో నీటి శాతం కూడా చాలా ఎక్కువ. కనుక శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.

ఉపవాసానంతరం చురుకుగా ఉండేందుకు దోహదం చేస్తాయి.

ఖర్జూరాలు ఒక ముక్క కొరికినా చాలు ఆ తియ్యదనంతో చురుకుగా అనిపిస్తుంది.

ఉపవాసం ఉండడం వల్ల వల్ల వచ్చే అసిడిటిని ఖర్జూరాలు నివారిస్తాయి.

వీటిలోని ఫైబర్ వల్ల జీర్ణక్రియ సజావుగా ఉంటుంది.

ఇలా రోజా ఉపవాసాన్ని ఖర్జూరాలతో ముగించడం గురించి మహ్మద్ ప్రవక్త సునాహ్ గా అభివర్ణించి చెప్పాడట.

ఖర్జూరాలు ప్రవక్తకు అత్యంత ప్రీతి పాత్రమైన డ్రైఫ్రూట్ గా కూడా చెప్పుకుంటారు.

Image Source: Pexels

ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే