సమ్మర్లో హెయిర్ డ్యామేజ్ కాకుండా ఇలా కాపాడుకోండి వేసవిలో హెయిర్ డ్యామేజ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. స్కాల్ప్‌పై చెమట పట్టడం వల్ల జుట్టు చికాకును కలిగించడంతో పాటు రాలిపోతుంది. ఎండలోకి వెళ్లినప్పుడు స్కాల్ప్ తడిగా మారి జుట్టు బాగా డ్యామేజ్ అవుతుంది. ఈ సమయంలో జుట్టు పరిస్థితి దారుణం కాకుండా రెగ్యూలర్‌గా ట్రిమ్ చేయాలి. సల్ఫేట్ ఫ్రీ షాంపూలతో హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇవి డీప్‌గా స్కాల్ప్‌ని క్లెన్స్ చేస్తాయి. జుట్టు వాష్ చేసుకున్న తర్వాత కచ్చితంగా కండీషనర్ పెట్టండి. సమ్మర్లో హీట్ స్టైలింగ్స్ చేయకపోవడమే మంచిది. ఇది జుట్టును మరింత డ్యామేజ్ చేస్తుంది. బయటకు వెళ్లినప్పుడు ఎండ జుట్టుకు తాకకుండా స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది. ఇవి అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది. (Images Source : envato)