రంగుల పండగ ఆడేపప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యానికి, అందానికి ఇబ్బంది కలుగుతుంది.

కళ్లకు కచ్చితంగా అద్దాలు పెట్టుకోవాలి. సన్​గ్లాసెస్​ కూడా కంట్లోకి రంగులు వెళ్లుకుండా అడ్డుకుంటాయి.

చర్మాన్ని రంగుల నుంచి కాపాడుకోవడానికి కొబ్బరి నూనె, ఆవనూనె లేదా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు.

జుట్టుకు కూడా కొబ్బరి నూనె రాయడం లేదా హెయిర్ సీరమ్​ని అప్లై చేస్తే కలర్స్ ఇబ్బంది ఉండదు.

కొత్తదుస్తులు పూజ తర్వాత వేసుకోవచ్చు కానీ.. హోలీ ఆడేప్పుడు కాస్త పాతవి వేసుకుంటే మంచిది.

కాంటాక్ట్ లెన్స్ వంటివి వాడకపోవడమే మంచిది. లేదంటే కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ.

పిల్లలు సింథటిక్ కలర్స్​తో కాకుండా సహజమైన రంగులతో ఆడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

రంగులతో అలెర్జీలు వచ్చే అవకాశముంది. కాబట్టి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

ఆస్తమా సమస్యలు ఉన్నవారు, గాయాలు ఉన్నవారు హోలీ ఆడేప్పుడు మరింత కేర్​ఫుల్​గా ఉండాలి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు కూడా తీసుకుని వాటిని ఫాలో అయితే మంచిది.