కంటి చూపు మందగించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అసలు వేటివల్ల ఈ సమస్య వస్తుందో ఇప్పుడు చూసేద్దాం.

వృద్ధులలో అంధత్వానికి ప్రధాన కారణం మాక్యులా దెబ్బతినడం. కంటిలో శుక్లం కూడా కారణం కావొచ్చు.

ఆప్టిక్ నాడిని దెబ్బతినడం వల్ల కూడా అంధత్వం రావొచ్చు. దృష్టినష్టానికి కారణమవుతుంది.

కండ్లకలక ఇన్​ఫెక్షన్​ వల్ల కూడా దృష్టిలోపం రావొచ్చు. సరైన చికిత్స చేయకుంటే దృష్టి నష్టం ఉంటుంది.

కార్నియా, ఎండోఫ్తాల్మిటిస్ ఇన్​ఫెక్షన్లు​ దృష్టి నష్టాన్ని ప్రేరేపిస్తాయి. అంధత్వానికి దారితీస్తాయి.

కంటిగాయాలు కావడం, కెమికల్స్ వల్ల కూడా కంటిచూపు మందగిస్తుంది. దృష్టిలోపం కూడా రావొచ్చు.

కొందరికి పుట్టుకతోనే కంటిశుక్లం వస్తుంది. ఐరిస్, రెటీనా వంటి కంటి నిర్మాణాలలో టియర్ ఉంటుంది.

విటమిన్ ఏ లోపం, యూవీ రేడియేషన్ వల్ల కూడా కంటి సమస్యలు వచ్చే ప్రమాదముంది.

స్మోకింగ్ చేసే అలవాటు ఉండేవారిలో కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

స్క్రీన్ సమయం పెరగడం వల్ల కూడా కంటి సమస్యలు వస్తాయని చెప్తున్నారు.