సంక్రాంతికి పండక్కి మీ స్కిన్ హెల్తీగా మెరవాలంటే రోటీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. స్క్రబ్, కెమికల్ ఎక్స్ఫోలియేట్ చేస్తే చర్మంపై మృతకణాలు తొలగుతాయి. పసుపు, కుంకుమ లేదా విటమిన్ సితో కూడిన మాస్క్ ఫేస్‌కి అప్లై చేస్తే స్కిన్ టోన్ మెరుస్తుంది. 1 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ గంధంలో రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసి దానిని ముఖానికి అప్లై చేస్తే మంచిది. కొబ్బరి నూనెలో పంచదార మిక్స్ చేసి.. స్క్రబ్‌గా ఉపయోగిస్తే స్కిన్‌కి హెల్ప్ చేస్తుంది. రోజూ 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగితే.. స్కిన్ హైడ్రేటింగ్‌గా ఉంటుంది. రోజ్‌వాటర్‌లో గ్లిసరిన్ కలిపి టోనర్‌గా ఉపయోగిస్తే స్కిన్ pH బ్యాలెన్స్ అవుతుంది. చర్మంపై స్కిన్ టాన్ పేరుకుపోకుండా SPF 30 ఉండే సన్‌స్క్రీన్‌ని ఉపయోగిస్తే మంచిది. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూడండి. ఇది స్కిన్‌కి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. ఈ టిప్స్ రోజూ ఫాలో అయితే స్కిన్ హెల్తీగా, మెరుస్తూ ఉంటుంది.