దానిమ్మకాయతో పచ్చడి తెలుసా? రెసిపీ ఇదే

Published by: Geddam Vijaya Madhuri

చాలామంది దానిమ్మ తినడానికి ఇష్టపడతారు. అలాగే ఊరగాయను కూడా ఇష్టంగా తింటారు.

అయితే మీకు తెలుసా? మీకు ఇష్టమైన దానిమ్మతో పచ్చడి చేసుకోవచ్చు.

ముందుగా పండిన దానిమ్మ పండ్లను తీసుకుని గింజలను తీసి శుభ్రం చేసుకోవాలి.

1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర, అర టీస్పూన్ నల్ల ఉప్పుతో పాటు మసాలా దినుసులు తీసుకోవాలి.

కారంగా ఉండటానికి 1-2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తీసుకోండి.

ఇప్పుడు మీరు మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీరను వేసి రుబ్బుకోండి. తీపి, పులుపు కోసం ఒక పెద్ద చెంచా నిమ్మరసం, చక్కెర వేసుకోవాలి.

మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకుని.. ఒక స్పూన్ నూనెలో ఇంగువ, జీలకర్ర వేసి వేయించి కలపండి.

ఇప్పుడు దీనిని శుభ్రమైన గాజు సీసాలలో నింపి ఉంచండి.

అంతే టేస్టీ దానిమ్మ పచ్చడి రెడీ.