ముందుగా అటుకులను కడిగి.. దానిలోని నీరుపోయేలా పిండి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అటుకుల్లో పసుపు, ఉప్పు కొంచెం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టావ్ వెలిగించింది. దానిపై కడాయి పెట్టి నూనె లేదా నెయ్యి వేసుకోవాలి.

దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి.

అవి కాస్త వేగిన తర్వాత పల్లీలు వేసుకుని క్రిస్పీగా వేగేవరకు వేయించుకోవాలి.

ఇప్పుడు దానిలో కాస్త ఇంగువ వేసి కలిపి ముందుగా సిద్ధం చేసుకున్న పోహాను కూడా వేసి కలుపుకోవాలి.

పూర్తిగా డ్రై అయ్యేవరకు ఉంచకుండా అన్ని అటుకులకు పట్టేలా కలుపుకోవాలి.

మీరు దించేసిన తర్వాత దానిలో కాస్త నిమ్మరసం పిండి, కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంతే పోహా రెడి.

మీరు ప్రోటీన్ కావాలనుకుంటే దానిలో కూరగాయలు వేసి కూడా చేసుకోవచ్చు.

ఉల్లిపాయలు, బఠాణీలు, క్యారెట్స్, ఉడికించిన బంగాళదుంపలు చాలామంది పోహాలో వేసుకుంటారు.