భారత ప్రభుత్వం ఈ పాస్​పోర్ట్​ సేవను అందుబాటులోకి తీసుకొచ్చి కొత్త శకానికి నాంది పలికింది.

ఈ లేటెస్ట్ అప్​డేట్​ వల్ల ప్రయాణీకులకు ఐడెంటిటీ మరింత సురక్షితం కానుంది.

ఈ-పాస్​పోర్ట్​ మైక్రోచిప్​తో అందుబాటులోకి వస్తుంది. దీనిలో వ్యక్తిగత సమాచారం ఉంటుంది.

బయోమెట్రిక్ వివరాలు ఈ చిప్​లో సురక్షతంగా ఉంటాయి.

ఈ సమాచారం ఎన్​క్రిప్ట్ చేసి ఉంటుంది. కాబట్టి వీటిని ఆఫీషయల్ స్కానింగ్ పరికరాలు మాత్రమే రీడ్ చేస్తాయి.

ఈ సౌకర్యం ఢిల్లీ, నాగ్​పూర్, చెన్నై, జైపూర్, హైదరాబాద్, రాంచీ, సిమ్లా, భువనేశ్వర్, గోవా, జమ్మూలో అందుబాటులో ఉంది.

భారతదేశం అంతటా ఈ సేవను అమలు చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా చేసుకుంది.

చిప్​లో ఇన్​ఫర్మేషన్ ఉండడం వల్ల దీనిని ఎవరూ నకిలీ చేయలేరు.

అంతర్జాతీయ విమానాశ్రయంలో గుర్తింపు ప్రక్రియ వేగంగా ఉంటుంది.

నార్మల్ పాస్​పోర్ట్ ఉండేవారు దీనిని వెంటనే రిప్లేస్ చేయాల్సిన అవసరం లేదు.