సమ్మర్​లో కొత్తగా స్కిన్​ కేర్ ప్రారంభించడం అస్సలు మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు.

మీరు కొత్తగా బ్యూటీ కేర్ ప్రారంభించాలనుకుంటే వింటర్ బెస్ట్ అంటున్నారు. దానివల్ల సమ్మర్​లో ఎలాంటి ఇరిటేషన్ రాదట.

అయితే మీరు రెగ్యులర్​గా స్కిన్ కేర్ ఫాలో అయ్యేవారు అయితే సమ్మర్​లో ఎలాంటి సీరమ్స్ ఎంచుకుంటే మంచిదో చూద్దాం.

విటమిన్ సి సీరమ్ చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో హెల్ప్ చేస్తుంది.

దీనిని సన్​స్క్రీన్​తో పాటు మార్నింగ్ ఉపయోగిస్తే యాంటీఆక్సిడెంట్​గా పనిచేసి.. పిగ్మెంటేషన్​ను తగ్గిస్తుంది.

హైల్యూరోనిక్ యాసిడ్ సీరమ్ సమ్మర్​కి మంచిది. డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది.

ఇది తేలికపాటి మాయిశ్చరైజర్​లా కూడా పని చేస్తుంది. అన్ని స్కిన్​ టైప్స్​కి బాగా సూట్ అవుతుంది.

నియాసినమైడ్ సీరమ్ చర్మంపై మచ్చలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. డ్రై స్కిన్​ వారికి బెస్ట్.

ఆయిల్ స్కిన్ ఉన్నవారు నియాసినమైడ్ సీరమ్ వాడకపోవడమే మంచిది.

అలొవెరా బేస్డ్ సీరమ్స్. ఇవి చర్మానికి హైడ్రేషన్​ని అందిచండంలో హెల్ప్ చేస్తుంది.

సమ్మర్​లో స్కిన్ ఇరిటేషన్​ వచ్చేవారు ఈ సీరమ్​ని ఉపయోగిస్తే మంచిది.