వేసవికాలంలో బొప్పాయి తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. మరి వీటిని ఎలా తీసుకుంటే మంచిదో చూసేద్దాం.

పండిన బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

సలాడ్స్, నట్స్​తో కలిపి బొప్పాయిని సమ్మర్​లో రిఫ్రెష్​ అవ్వడానికి తీసుకోవచ్చు.

యోగర్ట్, పాలు, లేదా ఐస్​క్రీమ్​లో బొప్పాయిని కలిపి స్మూతీగా చేసుకుని తాగితే శరీరం కూల్ అవుతుంది.

బొప్పాయిని సమ్మర్​లో రోజూ తీసుకుంటే శరీరానికి హైడ్రేషన్​తో పాటు ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.

బొప్పాయిలోని పాపైన్ వంటి ఎంజైమ్​లు కడుపులో మంటను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

ఇమ్యూనిటీని బూస్ట్ చేసేందుకు దీనిలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఇన్​ఫెక్షన్లు రాకుండా ఉంటుంది.

సమ్మర్​లో జుట్టును, స్కిన్​ను వేడి నుంచి కాపాడే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సి ఉంటాయి.

పండిన బొప్పాయి తింటే ఆరోగ్యానికి మంచిది. పచ్చిది తింటే జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదముంది.

ప్రెగ్నెన్సీతో ఉన్నవారు, బొప్పాయితో అలెర్జీ ఉండేవారు దీనిని తినకపోవడమే మంచిది.

వైద్యులు, నిపుణుల సహాయం తీసుకుని డైట్​లో దీనిని చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి.