కిస్​మిస్​లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని నేరుగా తీసుకున్నా, నానబెట్టి తీసుకున్నా ఎన్నో మంచి బెనిఫిట్స్ ఉంటాయి.

జీర్ణ సమస్యలను దూరం చేయడంలో ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.

వీటిలో సహజమైన షుగర్స్ ఉంటాయి. ఇవి శక్తిని అందిస్తాయి. ఉదయాన్నే వీటిని తింటే ఎనర్జిటిక్​గా ఉంటారు.

ఎండుద్రాక్షల్లోని యాంటీఆక్సిడెంట్లు కణాల నాణ్యతను దెబ్బతినకుండా కాపాడుతాయి. మంటను తగ్గిస్తాయి.

ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు రక్తంలోని షుగర్ లెవెల్స్​ని అదుపులో ఉంచి.. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.

గట్ హెల్త్​ని కూడా ప్రమోట్ చేసే వీటీని వైద్యుల సూచనలమేరకు తీసుకుంటే మంచిది.

ఎందుకంటే వీటివల్ల కొందరికి అలెర్జీలు వస్తాయి. మీ శరీరం ఇచ్చే సూచనలు గుర్తించాల్సి ఉంటుంది.

వీటిలో సహజమైన చక్కెరలు ఉంటాయి. నోటి శుభ్రతను ఫాలో అవ్వకపోతే దంత క్షయం రావొచ్చు.

కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని లిమిట్​గా తీసుకుంటే మంచిది. బరువు తగ్గాలనుకుంటే ఆలోచించాల్సి ఉంటుంది.

రోజుకు 1 లేదా 2 టేబుల్​స్పూన్ల ఎండుద్రాక్షలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు.