పరగడుపున ఆరెంజ్ తింటున్నారా? జాగ్రత్త!

ఆరెంజ్‌లో విటమిన్ C, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో దీని వల్ల ఆరోగ్యానికి నష్టం జరగవచ్చు.

ఖాళీ కడుపుతో ఉదయాన్నే తింటే రోజంతా కూడా మీ కడుపులో గ్యాస్‌తో బాధపడే ప్రమాదం ఉంటుంది.

విటమిన్ C అంటే ఆస్కార్బిక్ ఆసిడ్. కొంతమందికి ఇది ఎలర్జీ కలిగిస్తుంది.

ఆరెంజ్ ఆసిడిక్ లక్షణాలు కలిగించే పండు. దీనితో కడుపులో గ్యాస్ అవుతుంది. అసిడిటి కలిగిస్తుంది.

ఆరెంజ్ వల్ల అసిడిటి పెరిగితే జీర్ణవ్యవస్థ లోపలి పొరకు నష్టం జరుగుతుంది.

ఖాళీ కడుపుతో ఆరెంజ్ తింటే జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. రిఫ్లక్స్ సమస్య రావచ్చు.

రోజును పుల్లని పండ్లతో మొదలు పెడితే అసిడిటి పెరుగుతుంది. రిఫ్లక్స్ అవుతుంది. ఛాతిలో మంట కూడా రావచ్చు.

అదనపు జీర్ణ రసాల ఉత్పత్తి వల్ల హైపర్ అసిడికి కారణం కావచ్చు. ఇది అల్సర్‌కు దారితియ్యవచ్చు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!