పానీపూరి అంటే అందరికీ ఇష్టమే కానీ.. బయట తినేందుకు కాస్త ఇబ్బంది ఉంటుంది. అయితే మీరు ఇంట్లోనే సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. బంగాళదుంపలు ఉప్పు వేసి ఉడికించి పొట్టు తీసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దానిలో సన్నగా తరగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం వేయాలి. చాట్ మసాలా కూడా వేసి అన్ని కలిసేలా బాగా కలపాలి. మరో గిన్నెలో రవ్వ, మైదా, నూనె, నీళ్లు వేసి పిండిని ముద్దగా చేయాలి. పూరీలుగా ఒత్తుకుని పానీ పూరీ సైజ్లో కట్ చేసుకుని వాటిని డీప్ ఫ్రై చేయాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, నీళ్లు, జీలకర్రపొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి మిక్సీ చేయాలి. చాట్, పానీపూరీ డ్రింక్ రెడీ కాబట్టి మంచిగా ఇంటిల్లీపాది పానీపూరి లాగించేయవచ్చు. (Images Source : Unsplash)