ఎండాకాలంలో పెరుగు తింటే బోలెడు లాభాలు! వేసవిలో రోజూ పెరుగు తింటే మంచిదంటున్నారు నిపుణులు. పెరుగు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా ఎనర్జీ లెవెల్స్ ను పెంచుతుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరిచి, జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. పెరుగులోని విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పెరుగులోని పొటాషియం రక్తపోటును అదుపు చేసి, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. పెరుగులోని ప్రొటీన్లు కడుపు నిండుగా అనిపించేలా చేసి బరువును తగ్గిస్తాయి. పెరుగు కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించి ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది. పెరుగులోని కాల్షియం ఎముకలను దృఢంగా మార్చుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.All Photos Credit: Pixabay.com