పారాసిటమాల్ తో కాలేయానికి ముప్పు తప్పదా? కాస్త జ్వరం అనిపిస్తే చాలు చాలా మంది పారాసిటమాల్ టాబ్లెట్లు వేసుకుంటారు. అదేపనిగా ఈ టాబ్లెట్స్ వాడితే తీవ్ర సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా పారాసిటమాల్ తీసుకుంటే శరీర అవయవాలు దెబ్బతింటాయంటున్నారు. ముఖ్యంగా కాలేయం పని తీరు మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. పారాసిటమాల్ ఎక్కువ తీసుకునే రోగుల్లో కాలేయం దెబ్బతిన్నట్టు పరిశోధనల్లో తేలింది. కాలేయం మాత్రమే కాదు, ఇతర అవయవాల్లోని కీలకమైన నిర్మాణాల్ని దెబ్ తీస్తున్నట్లు వెల్లడైంది. రోజుకు 4 గ్రామలకు మించి పారాసిటమాల్ తీసుకోవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com