కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే? ఈ జాగ్రత్తలు తీసుకోండి! కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు. రోజుకు కనీసం 3 లీటర్లు నీళ్లు తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. ఉప్పును వీలైనంత వరకు తక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు రావు. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. పండ్లు, కూరగాయలను అధికంగా తినండం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు. విటమిన్ C సప్లిమెంట్లను వీలైనంత వరకు తక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు రావు. మూత్రంలో ఆక్సలేట్ స్థాయి ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: Pixabay.com