Image Source: pexels

మనం చాలాసార్లు జామపండ్లలో పురుగులను చూస్తుంటాం. పైకి తాజాగా కనిపించినా లోపల పురుగులు ఉంటాయి.

జామకాయలను కొనుగోలు చేసేటప్పుడు అందులో పురుగులు ఉన్నాయని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జామకాయల్లో ఉండే పురుగులు కీటకాలే. కాయలు పెరుగుతున్న సమయంలో కీటకాలు వాటిని తింటుంటాయి.

ఈ సమయంలో పండ్లపై కీటకాలు గుడ్లు పెడతాయి. వాటి నుంచి లార్వా పండును రంధ్రాలు చేసి అందులోకి వెళ్తాయి.

జామపండుపై ఎక్కువగా రంధ్రాలు ఉంటే అందులో పురుగులు ఉన్నాయని గుర్తించాలి.

జాగ్రత్తగా పరిశీలిస్తే తేలికపాటి బ్లాక్ హోల్స్ రూపంలో కనిపిస్తాయి. పసుపు లేదా ఆపిల్ కట్ చేస్తే వచ్చే రంగును కలిగి ఉంటాయి

మీరు జామకాయలను కొనుగోలు చేసే ముందు ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తించాలి.

అతిగా పండిన ,దెబ్బతిన్న పండ్లను కొనకపోవడమే బెటర్. అందులో పురుగులు ఉండే అవకాశం ఉంటుంది.

గ్రీన్ కలర్ లేదంటే ఎల్లో కలర్ లో ఉన్న జామపండ్లను మాత్రమే కొనండి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.