మష్రూమ్స్​ పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి వివిధ రకాలుగా ప్రయోజనాలు అందిస్తాయి.

విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన వీటిని తింటే కలిగే లాభాలేంటో ఇప్పుడు చూసేద్దాం.

ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సమ్మర్​లో వచ్చే జీర్ణసమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

మష్రూమ్స్​లో విటమిన్ సి, డి.. కాపర్, సిలేనియం, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి.

కేలరీలు తక్కువగా ఉండే ఈ మష్రూమ్స్​ను బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్​లో చేర్చుకోవచ్చు.

రోగనిరోధక శక్తిని పెంచి.. ఇన్​ఫెక్షన్ల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల నాణ్యత దెబ్బతినకుండా కాపాడడంలో హెల్ప్ చేస్తాయి.

కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేసి.. గుండె సమస్యలు రాకుండా హెల్ప్ చేస్తాయి.

బ్లడ్ షుగర్​ను కంట్రోల్​లో ఉంచి.. మధుమేహ సమస్యలను దూరం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుని డైట్​లో చేర్చుకుంటే మంచిది.