కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విష సర్పం. దీని పొడవు 10 నుంచి 12 అడుగుల వరకు ఉంటుంది. అత్యంత పొడవైన కింగ్ కోబ్రా రికార్డు దాదాపు 18 అడుగులు
కింగ్ కోబ్రా పడగ అనేది చర్మం మాత్రమే కాదు. ఇందులో పక్కటెముకలు, కండరాలు కూడా ఉంటాయి. పాము బెదిరిపోయినప్పుడు అది తన పక్కటెముకలను విస్తరించి పడగను పెద్దదిగా చేస్తుంది.
కింగ్ కోబ్రా విషంలో న్యూరో టాక్సిన్లు ఉంటాయి. కాటు వేసినప్పుడు ఇవి తక్షణమే నాడీ వ్యవస్థ పై దాడి చేసి పక్షవాతం లేదా మరణానికి కారణమవుతాయి.
కింగ్ కోబ్రాలు కొండచిలువతో సహా ఇతర విషపూరిత జాతులను కూడా తినేస్తాయి
భారతదేశంలోని ఆగ్నేయాసియా చైనాలోని కొన్ని ప్రాంతాల్లోనూ కింగ్ కాబ్రాలు ఉంటాయి.
ఆడ నాగు పాములు తమ గుడ్లను కాపాడుకునేందుకు ఆకులు మరియు కొమ్ములతో ఒక గూడు కట్టుకుంటాయి. పిల్లలు గుడ్ల నుంచి బయటకు వచ్చేవరకు వాటిని విధిగా కాపాడుకుంటాయి.
ఉష్ణ మండల ప్రాంతాలు, వర్షాలు పడే అడవులు, చిత్తడి నేలలు అంటే రాచనాగులకు ఇష్టం.
కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైనది అయినప్పటికీ దేనికి సహజ శత్రువు ముంగిస.
కింగ్ కోబ్రా బుస కొట్టడమే కాదు, తనను తాను కాపాడుకునే ప్రక్రియలో నెమ్మదిగా గాలిని ఊపిరితిత్తుల నుంచి విడుదల చేయడం ద్వారా ఒక రకమైన శబ్దాన్ని కూడా చేయగలదు.