సేమియా పాయసం ఒక సాంప్రదాయ తీపి వంటకం. ఇది వేయించిన సేమియా, పాలు, చక్కెర, యాలకులుతో తయారు చేస్తారు. ఇది కుటుంబ సమావేశాల్లో హైలెట్‌గా నిలిచే స్వీట్.
BBQ చికెన్ వింగ్స్ క్రిస్పీగా ఉంటాయి. స్మోకీ, టాంగీ సాస్‌తో రుచిగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటే ఇది పక్కా ఉండాల్సిందే.
ఉల్లికాడలు, బంగాళాదుంపలతో చేసే క్రీమీ సూప్ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో బెస్ట్ అవుతుంది. ఇది చల్లదనంలో వెచ్చగా, మంచి రుచిని ఇస్తుంది.
గాజర్ కా హల్వా అనేది తురిమిన క్యారెట్లు, పాలు, చక్కెర, నెయ్యితో తయారు చేస్తారు. స్వీట్ డెజర్ట్ కావాలనుకునేవారు దీనిని తప్పక ట్రై చేయాలి. దీని రుచిని పెంచుకునేందుకు యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు.
దానిమ్మ, కాలే కాంబినేషన్ ఒక శక్తివంతమైన సలాడ్ అవుతుంది. ఇది వివిధు రుచులతో బ్యాలెన్స్ అవుతుంది. కచ్చితంగా మీరు తీసుకునే ఫుడ్‌లో పోషకాహారం అవుతుంది.
చీజీ గార్లిక్ బ్రెడ్ బటర్, వెల్లుల్లి, హెర్బ్స్ వంటి గొప్ప రుచులను కలిగి ఉంటుంది. ఇది ఏ భోజనంతోనైనా సరిపోయే గొప్ప సైడ్ డిష్.
క్రీమీ చిల్లీ మష్రూమ్స్ రుచికరమైన వంటకం. ఇది మీ భోజనానికి రుచిని అందిస్తుంది. లేత పుట్టగొడుగులు, చిల్లీ ఆయిల్, క్రీమ్తో దీనిని తయారు చేస్తారు.
సౌటెడ్ వెజిటబుల్స్ ఒక సులభమైన వంటకంగా చెప్పవచ్చు. దీనిని స్నాక్‌గా, మెయిన్ డిష్‌గా తీసుకోవచ్చు. నూనె లేదా నెయ్యితో కాస్త వేయించి తీసుకుంటే రుచిగా ఉంటాయి.
కోడి, పాలకూర కాస్రోల్ అనేది కోడి, పాలకూర, క్రీము సాస్‌తో తయారు చేసే వంటకం. ఈ టేస్టీ, రిచ్ వంటకం నూతన సంవత్సర వేడుకలకు సరైనది.
టిరామిసు ట్రైఫిల్ను కాఫీలో నానబెట్టిన స్పంజ్, క్రీమీ మస్కార్పోన్, కోకో పొరలతో చేస్తారు. ఇది సాంప్రదాయ డెజర్ట్కు ఒక ఆహ్లాదకరమైన మార్పును అందిస్తుంది. నూతన సంవత్సర వేడుకలకు ఇది సరైన డెజర్ట్.