నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

చాలామంది ఇళ్లలో స్వచ్ఛమైన దేశీ నెయ్యిని విరివిగా ఉపయోగిస్తారు.

Image Source: freepik

దేవునికి నైవేద్యం సమర్పించే దగ్గర నుంచి గర్భధారణ సమయంలో తయారుచేసే లడ్డూల వరకు అన్నింటిలోనూ నెయ్యి వేస్తారు.

Image Source: freepik

ఆయుర్వేదం ప్రకారం.. రోజువారీగా దేశీ నెయ్యి తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Image Source: freepik

కానీ కొంతమందికి దేశీ నెయ్యి తీసుకోవడం హానికరం కావచ్చు.

Image Source: freepik

అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఉన్న రోగులు నెయ్యిని తీసుకోకూడదు. ఎందుకంటే ఇది సంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది.

Image Source: freepik

ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్న వారు కూడా నెయ్యి తీసుకోవడం మానుకోవాలి.

Image Source: freepik

అధిక రక్తపోటు ఉన్న రోగులు కూడా నెయ్యి తినకపోవడమే మంచిది.

Image Source: freepik

ప్రతిరోజు వ్యాయామం లేదా యోగ చేయని వారు నెయ్యి తీసుకోవడం తగ్గించాలి.

Image Source: freepik

అజీర్ణం, గ్యాస్ లేదా పొట్ట సమస్యలు ఉన్న రోగులు కూడా నెయ్యి తీసుకోవడం మానుకోవాలి. ఇది పొట్ట సమస్యలను మరింత పెంచుతుంది.

Image Source: freepik