మీకు నిద్ర సమస్య ఉందా? అయితే మీ నిద్రను పెంచే చిట్కాలు ఇక్కడున్నాయి.

వివిధ కారణాలతో చాలామందికి నిద్ర నాణ్యత, సమయం తగ్గుతుంది.

ఈ సమయంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే నిద్ర నాణ్యత పెరుగుతుంది.

రాత్రుళ్లు నిద్ర వచ్చినా రాకున్నా మీ టైమింగ్స్ ప్రకారం నిద్రపోయే, లేచే టైమ్ మారకుండా చూసుకోండి.

నిద్ర టైమింగ్స్ రోటీన్​గా ఉంటే మెరుగైన నిద్ర మీ సొంతవుతుంది.

అరోమా థెరపీ మెరుగైన నిద్రను ప్రమోట్ చేస్తుంది. ఒత్తిడి దూరం చేసి నిద్రను ఇస్తుంది.

పడుకునే ముందు చామంతిపూలతో చేసిన టీ తాగితే మంచి నిద్ర మీ సొంతమవుతుంది.

సాయంత్రం మూడు తర్వాత కాఫీ, కెఫీన్ తీసుకోకపోవడమే మంచిది.

నిద్రకు కనీసం గంట ముందు నుంచి ఫోన్, ల్యాప్​టాప్​ను దూరంగా ఉంచండి.

గదిలో ఉష్ణోగ్రత కూడా మంచిగా ఉండేలా చూసుకోండి. ఇది మెరుగైన నిద్రను ఇస్తుంది.