వివిధ సమస్యల వల్ల పింపుల్స్​ వస్తూ ఉంటాయి. అలా అని కెమికల్స్ ఉపయోగిస్తే ఎక్కువ అవుతాయి.

అయితే వీటిని సహజంగా దూరం చేసుకోవాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం.

అలొవెరా జెల్​ని పింపుల్స్​పై అప్లై చేస్తే తగ్గుతాయి. తాజా కలబంద గుజ్జును అప్లై చేసి రాత్రంతా ఉంచితే బెటర్.

నూనె లేదా నీటితో డైల్యూట్ చేసిన టీ ట్రీఆయిల్​ని తీసుకుని దానిని పింపుల్స్​పై అప్లై చేయాలి.

తేనెలో దాల్చినచెక్క పొడి కలిపి దానిని పింపుల్స్​పై అప్లై చేస్తే మంచి ఫలితాలు చూస్తారు.

వేపాకుల పేస్ట్​ కూడా పింపుల్స్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఈ పేస్ట్​ని అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

ఐస్ క్యూబ్స్​తో మసాజ్ చేస్తే వాపు, ఎర్రదనం తగ్గుతుంది. పింపుల్స్​ కూడా తగ్గుతాయి.

యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. నీటితో కలిపి కాటన్ బాల్​తో పింపుల్స్​పై దానిని అప్లై చేయాలి.

గ్రీన్​ టీని రెగ్యులర్​గా తాగడంతో పాటు.. ఐస్ క్యూబ్స్​గా చేసుకుని ముఖానికి అప్లై చేస్తే మంచిది.

పింపుల్స్​ని ఎప్పుడూ చితక కొట్టకూడదు. సహజంగా తగ్గేవరకు ఎదురు చూడాలి.

మరి ఎక్కువగా మొటిమలు వస్తే వైద్య సహాయం తీసుకుంటే మంచిది.