ఇన్ఫెక్షన్ల బారిన పడినపుడు కోలుకునేందుకు యాంటీబయోటిక్స్ వాడుతాం. వాటిని ఎక్కువగా వాడితే బ్యాక్టీరియా ఆ మందులకు అలవాటుపడి.. మరింత బలోపేతం అవుతుంది. అలాంటి బ్యాక్టీరియాను నివారించేందుకు కొన్ని సహజమైన సమ్మేళనాలు పనిచేస్తాయట. అల్లం సహజమైన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలతో పాటు యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీకాగులెంట్ ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది. వెల్లుల్లి లో ఆలిసిన్, ఆజోయెన్స్, సల్ఫైడ్స్ వంటి సమ్మేళనాలతో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. తేనెలో యాంటీమైక్రోబియల్ గుణాలు, గాయాలు మాన్పే శక్తి కలిగి ఉంటుంది. డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాను కూడా నిర్మూలించగలదు. లవంగాల నుంచి తీసిన ఎక్ట్స్రాట్స్ లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఆరీగానోలో యాంటీఆక్సిడెంట్లతో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది కూడా. ఆరిగానోలో యాంటీబయోటిక్ లక్షణాలుంటాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.