శతాబ్ధాలుగా అల్లం, పసుపు వాటి ఔషధ గుణాలతో ప్రత్యేకం. పసుపు, అల్లం కలిపి తీసుకున్నపుడు రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. అల్లం, పసుపు కలిపి తీసుకుంటే నొప్పి నివారణి గా పనిచేస్తుందని చైనీస్ సాంప్రదాయ వైద్యం సూచిస్తోంది. అల్లం, పసుపుల్లో బలమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పసుపులోనూ, అల్లం లోనూ ఉండే సమ్మేళనాలు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. కండరాలు, మెదడు ఆరోగ్యానికి అల్లం పసుపు వంటి కొమ్ము దుంపలు బాగా దోహదం చేస్తాయి. ఇన్ఫ్లూయెంజా, న్యూమోనియా వంటి ఇన్ఫెక్షన్లను కూడా పసుపు, అల్లం తో చేసిన టీతో నివారించవచ్చు. జలుబు, దగ్గు వల్ల కలిగే అనారోగ్య లక్షణాలను తగ్గించడానికి ఈ టీ బాగా ఉపయోగపడుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు.