మ్యాంగో డే.. మామిడి పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా? ఏటా జులై 22న మ్యాంగో డే జరుపుకుంటారు. మామిడి పండ్లలో బోలెడంత ఫైబర్ ఉంటుంది. ఇవి గట్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మామిడిలోని ఫైబర్ మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తాయి. మామిడిలో తక్కువ కేలరీలు, పిండి పదార్థాలు, కరికే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి బరువును తగ్గిస్తాయి. మామిడిలో విటమిన్లు ఎ, సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మం , జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మామిడిపండ్లు ఎంతో సహాయపడతాయి. ఈ పండులో ఫైబర్, కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. రక్తంలో ఆక్సిజన్ ప్రవాహానికి సహాయపడుతుంది. మామిడిలో ఉండే విటమిన్లు ఇమ్యూనిటిని పెంచుతాయి.