ఆవనూనెలో ఈ ఒక్కటి కలిపి అప్లై చేస్తే పొడుగాటి జుట్టు మీ సొంతం ఆవనూనెలో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ, విటమిన్ ఈ, ప్రోటీన్ ఉంటుంది. ఇవి జుట్టుకు కుదుళ్లనుంచి పోషణను అందించి.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అయితే జుట్టు పొడుగ్గా పెంచుకోవాలనుకునేవారు ఆవనూనెలో విటమిన్ ఈ క్యాప్సుల్ కలిపి అప్లై చేసుకోవచ్చు. ఆవనూనెలో కూడా విటమిన్ ఈ ఉంటుంది. అయితే ఈ క్యాప్సుల్‌ని కూడా కలిపి అప్లై చేస్తే చాలా మంచిది. నెలరోజులు ఆవనూనెను ఇలా అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గి.. పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. ఆవనూనెలో విటమిన్ ఈ కలిపి.. స్కాల్ప్‌పై అప్లై చేస్తే మసాజ్ చేసుకోవాలి. ఇలా నూనెను కుదుళ్ల నుంచి జుట్టుకు అప్లై చేశాక.. రెండు గంటల తర్వాత షాంపూ చేయాలి. వారానికి మూడుసార్లు ఈ విధంగా నూనెను అప్లై చేయొచ్చు. దీనివల్ల జుట్టుకు లోపలి నుంచి పోషణ అందుతుంది. ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)