క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. ఇది వస్తే శరీరంలో క్యాన్సర్ కణాలు బాగా పెరుగుతాయి.

ఈ మధ్యకాలంలో చాలామంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు.

వివిధ రకాల్లో అటాక్ చేసే ఈ క్యాన్సర్లలో ఏ క్యాన్సర్ అత్యంత ప్రమాదమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లడ్ క్యాన్సర్ అన్ని క్యాన్సర్ల కంటే ప్రమాదమని అందరూ నమ్ముతారు.

కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అన్నింటికంటే ప్రమాదమంటున్నారు నిపుణులు.

ఈ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు చాలా తక్కువగా తెలుస్తాయి కాబట్టి గుర్తించడం కష్టం.

దీనివల్ల కడుపునొప్పి, అజీర్ణం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కాబట్టి దీనిని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. దీనివల్ల గుర్తించే సరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుందట.

గుర్తించేసరికి 3 లేదా 4వ దశకు అది చేరుకుంటుంది కాబట్టి ట్రీట్​మెంట్ కష్టమవుతుందట.

అందుకే ఈ క్యాన్సర్ అన్ని క్యాన్సర్ల కంటే ప్రమాదమని చెప్తున్నారు.