జిలేబి అంటే ఇష్టమా? అయితే వీటిని ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు.

ఓ కప్పు మైదా, అరకప్పు పెరుగు, నీళ్లు పిండికి సరిపడేంత, పసుపు చిటికెడు, బేకింగ్ సోడా పావు టీస్పూన్ తీసుకోవాలి.

పంచదార పాకం కోసం కప్పు పంచదార, అరకప్పు నీళ్లు, యాలకులు 2, కుంకుమ 2, నిమ్మరసం 1 టీస్పూన్ తీసుకోవాలి.

ముందుగా ఓ మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో మైదా, పెరుగు, నీళ్లు, పసుపు వేసి చిక్కగా కలుపుకోవాలి.

ఉండలు లేకుండా మొత్తం పిండి కలిసేలా కలుపుకోవాలి. పిండి కాస్త చిక్కగా ఉండాలి.

ఇప్పుడు దానిపై మూత వేసి పది గంటలు పక్కన పెట్టేయండి. లేదంటే పిండిని వేడినీళ్లతో కలిపి 2 గంటలు పక్కన పెడితే సరిపోద్ది.

స్టౌవ్ వెలిగించి దానిలో పంచదార, నీటిని వేసి పాకం వచ్చేవరకు ఉడికించుకోవాలి.

దానిలోనే నిమ్మరసం, కుంకుమ వేయొచ్చు. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి నూనె పెట్టుకోవాలి.

పిండిని తీసుకుని జిలేబీలుగా వేసుకుని వేయించుకోవాలి. క్రిస్పీగా, బంగారు రంగులోకి రానివ్వాలి.

వాటిని పంచదార పాకంలోకి వేసుకోవాలి. నిమిషం దానిలో ఉంచి పక్కకు తీసేస్తే జిలేబి రెడీ.