ఉదయాన్నే జాగింగ్ చేస్తే కలిగే లాభాలివే

ఉదయాన్నే జాగింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎన్నో లాభాలుంటాయి. అవి ఏంటో.. శారీరకంగా, మానసికంగా కలిగే ప్రయోజనాలివే.

ఉదయాన్నే జాగ్ చేస్తే గుండె ఆరోగ్యానికి మంచిది. కార్డియోవాస్కులర్ సమస్యలు దూరమవుతాయి.

శక్తిని పెంచి.. వర్క్​పై ఫోకస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీనివల్ల రోజంతా ఎనర్జిటిక్​గా ఉంటారు.

కేలరీలను బర్న్ చేసి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. మెటబాలీజంను పెంచుతుంది.

ఒత్తిడి, యాంగ్జైటీ సమస్యలు తగ్గుతాయి. మైండ్ క్లియర్​గా ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి.

మంచి మూడ్​ని ప్రమోట్ చేసే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి మిమ్మల్ని పాజిటివ్​గా ఉంచుతాయి.

నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. నిద్ర సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

జాగింగ్​ని మొదలు పెట్టాలనుకుంటే మీరు చిన్నగా స్టార్ట్ చేయండి. తక్కువ దూరం వెళ్లండి. తర్వాత స్టామినాను బట్టి పెంచుకోవచ్చు.

జాగ్ చేస్తున్నప్పుడు, జాగ్ చేసే ముందు.. తర్వాత కూడా నీటిని తాగితే మంచిది. ఇది హైడ్రేటెడ్​గా ఉంచుతుంది.