పెసలు తింటే ఏమవుతుందో తెలుసా?

పెసలు 15 రోజులు పరగడుపున తింటే ఆ బెనిఫిట్స్ మీవే

Published by: Geddam Vijaya Madhuri

పోషకాలు నిండిన పెసలు

పెసలు వివిధ రూపాల్లో డైట్​లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. పోషకాలతో నిండిన పెసలు హెల్త్​కి చాలా మంచివట.

డైట్​లో తీసుకుంటే

ఫిట్​గా, హెల్తీగా ఉండాలనుకునేవారు.. తమ రెగ్యూలర్ డైట్​లో పెసలు కలిపి తీసుకోవచ్చు. వీటిలోని పోషకాలు మీకు ఎన్నో బెనిఫిట్స్ ఇస్తాయి.

పవర్ ప్యాక్డ్ పెసలు

పెసల్లో న్యూట్రిషియన్స్, విటమిన్స్, ప్రోటీన్, మాంగనీస్, రాగి, పొటాషియం, జింక్ ఉంటాయి. వీటిని రెగ్యూలర్​గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

రోగనిరోధక శక్తికై

పెసలు ఇమ్యూనిటీని పెంచుతాయి. సీజనల్ వ్యాధులను దూరం చేయడానికి ఇమ్యూనిటీ చాలా అవసరం.

బరువు తగ్గేందుకు

పెసలు రోజూ తీసుకుంటే బరువు తగ్గుతారు. వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి బరువును కంట్రోల్ చేస్తాయి.

హెల్తీ స్కిన్

మెరిసే, గ్లోయింగ్ స్కిన్​ని పెసలు ప్రమోట్ చేస్తాయి. వీటిని నేరుగా తీసుకున్నా.. ముఖానికి పేస్ట్​గా, నలుగుగా అప్లై చేసిన మంచి ఫలితాలుంటాయి.

జీర్ణ సమస్యలుంటే..

వర్షాకాలంలో పెసలు రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం కంట్రోల్ అవుతుంది.

గుండె ఆరోగ్యానికై..

పెసల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్​ని తగ్గించి.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.

నానబెట్టి తినాలి..

పెసలు ఆరోగ్యానికి మంచివే కానీ.. పచ్చిగా తినకూడదు. వాటిని నానబెట్టి స్ప్రౌట్స్​గా పరగడుపునే తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

అవగాహన కోసమే

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. (Images Source : Envato)